ఎన్నో దశాబ్దాలుగా నెల్లూరు ఏసీ మార్కెట్ వద్ద పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు నిలిచిపోయాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతర కృషితో సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో పండ్ల మార్కెట్ సర్వంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఈ నెల 30న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు మీద ఈ మార్కెట్ ను ప్రారంభిస్తున్నామని నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి తెలిపారు.