నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పండ్ల మార్కెట్లో 1.53 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శనివారం పరిశీలించారు. మార్కెట్ శాఖ అధికారులతో కలిసి ఆయన పనుల పురోగతిని సమీక్షించారు. మరో 10 రోజుల్లో పనులు పూర్తి కానున్నాయని, అనంతరం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీటిని పరిశీలిస్తారని గిరిధర్ రెడ్డి తెలిపారు.