మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మంగళవారం నెల్లూరులోని వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి బహిరంగ విచారణకు సిద్ధమని చెప్పడంతో తోక ముడిచారని అన్నారు. సోమిరెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమంటూ విసిరిన సవాల్ ను తాను స్వీకరించడంతో, ఆయన తోకముడిచి పారిపోయారని కాకాని ఆరోపించారు. సోమిరెడ్డి ఆవేశంగా సవాల్ విసిరి, తర్వాత ఆలోచించుకుని పత్తా లేకుండా పోయారని ఆయన పేర్కొన్నారు.