జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న 20 గ్రామాలలో త్రాగు నీరు, విద్యుత్, అంతర్గత రోడ్లు వంటి మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఐ.టి.డి.ఎ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యానాదులు, ఎరుకల, సుగాలీలు, చెంచులు, నక్కల వాళ్ళు అధికంగా ఉన్న గ్రామాలలో గిరిజనుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత 24 శాఖలకు సూచించారు.