గురువారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి బుధవారం అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ పరిశీలనలో నెల్లూరు ఏఎంసి డైరెక్టర్ సుధాకర్, వ్యాపారస్తుల సంఘం అజీజ్ తదితరులు పాల్గొన్నారు.