మహానాడు-2026 నేపథ్యంలో, 27, 28, 29 తేదీల్లో జరగనున్న కార్యక్రమానికి భారీ జనసంద్రాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లను ప్రారంభించింది. గుంటూరు రేంజ్ ఐజీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణాన్ని సందర్శించి, ప్రధాన వేదిక, పార్కింగ్ జోన్లు, హైవే అప్రోచ్ పాయింట్లు, ట్రాఫిక్ డైవర్షన్ మార్గాలను పరిశీలించారు. సుమారు 3 లక్షల మంది ప్రజలు, 10 వేల వాహనాలు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల భద్రతా ప్రణాళికపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.