నెల్లూరు: భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

3చూసినవారు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. 4,410 కిలోల బరువున్న CMS-3 ఉపగ్రహాన్ని LVM3-m5 రాకెట్ ద్వారా ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు నింగిలోకి ప్రయోగించనుంది. భూమి నుంచి బయలుదేరిన 16.09 నిమిషాల్లోనే ఈ భారీ శాటిలైట్ ఆర్బిట్లోకి చేరుకుంటుంది. సైనిక సమాచార అవసరాల కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఉపగ్రహం, భారత్ ఇంతవరకు ప్రయోగించిన వాటిలోకెల్లా అత్యంత బరువైనది. షార్‌లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.