నెల్లూరు రూరల్ శ్రామిక నగర్ లో శుక్రవారం జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే, ఎమ్మెల్యేగా కాకుండా కుటుంబ సభ్యుడిగా, అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.