నెల్లూరు: ఉత్తర ద్వార దర్శనంలో దర్శనమిచ్చిన రంగనాథ స్వామి

579చూసినవారు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రంగనాయకుల స్వామి దేవస్థానంలో ఉదయం 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు కిక్కిరిసిపోయారు. శ్రీ రంగనాథుడు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలతో దేవస్థానం నిండిపోయింది. వేలాదిమంది భక్తులు వారికి విచ్చేయడంతో ముందు జాగ్రత్తగా దేవాలయ అధికారులు క్యూలైన్లతో పాటు తగిన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్