సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ త్యాగరాజ కళ్యాణ మండపంలో నవంబర్ 2, ఆదివారం నాడు ఈశ్వరునికి మహా రుద్రాభిషేకం జరగనుంది. సింహపురి ధార్మిక సంస్థ అధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ఈశ్వరునికి మహా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భక్తులు ఆధ్యాత్మికంగా లబ్ధి పొందుతారని ఆయన పేర్కొన్నారు.