నెల్లూరు: మహానాడు కాదు మాయనాడు

6చూసినవారు
నెల్లూరు: మహానాడు కాదు మాయనాడు
గత రెండు రోజుల క్రితం టీడీపీ నిర్వహించిన మహానాడు కార్యక్రమం మాయనాడు లా జరిగిందని వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. శనివారం నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, మహానాడులో టీడీపీ నాయకులు ప్రజలకు ఏమి చేశారో చెప్పుకోలేక కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పరమావధిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా మహిళలకు రక్షణ కరువైందని, ఈ విషయం ప్రజలందరికీ తెలిసినా, మాయనాడు వేదికలో మహిళల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :