దువ్వూరు సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.