నెల్లూరు నగరంలో శాంతిభద్రతలను సమీక్షించేందుకు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల బుధవారం రాత్రి స్వయంగా రంగంలోకి దిగారు. మద్రాసు బస్టాండు నుంచి వీ ఆర్సీ సెంటర్ వరకు సిబ్బందితో కలిసి పర్యటించి, ప్రయాణికులు, స్థానికులతో మాట్లాడారు. ముఖ్యంగా మహిళలు రాత్రి వేళల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.