కాకాణి గోవర్ధన్‌పై తప్పుదారి పట్టించేలా కేసులు పెట్టి జైలుకు పంపారని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గురువారం అన్నారు. జగన్‌ను చూసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే, ఆయనకు బలం లేదని చూపించేందుకు పోలీసులు, నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్‌పై ఉన్న అభిమానాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. వీపీఆర్ ఫ్యాక్టరీ అంశాలన్నింటినీ బయటపెడతానన్నారు.