మంగళవారం, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పర్యటించారు. డివిజన్లు 3, 4, 5, 42, 45, 48, 49, 52, 53, 54 లలో తుఫాన్ బాధితులైన 4 వేల మందికి ఆహార పొట్లాలను అందజేశామని ఆయన తెలిపారు. వరద ప్రాంతాల్లో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి సేవలందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.