నెల్లూరు రూరల్ పరిధిలోని 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనకు టిడిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సుధాకర్, కోటంరెడ్డి సోదరులు అవకాశం కల్పిస్తే పార్టీలో చేరుతానని విన్నవించుకున్నారు. గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన టిడిపిలో చేరారు.