నెల్లూరు మూలాపేటలోని శ్రీ కృష్ణ ధర్మరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం చప్పర ఉత్సవం ఘనంగా నిర్వించారు. రాత్రి తపస్సు మాను నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి జానకమ్మ ఆధ్వర్యంలో ఉభయకర్తలు, ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు వారి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.