నెల్లూరు నగరంలో దీపావళి వేడుకల సందర్భంగా టపాసుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలని కమిషనర్ నందన్ గురువారం సూచించారు. అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలను పాటించకుండా టపాసులు అమ్మడం చట్ట విరుద్ధమని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత దృష్ట్యా ప్రతి విక్రేత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ ఆదేశించారు.