నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా గురువారం శ్రీ నందీశ్వరునికి, శ్రీ స్వామి వారికి విశేష అభిషేకాలు జరిగాయి. అనంతరం చిన్న వెండి నంది వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను, నందీశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.