తుఫాను వల్ల పనులు కోల్పోయిన పేదలందరికీ బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించాలని సీపీఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కోరింది. తుఫాన్ బాధితులను ఆదుకోవాలని వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా సెక్రెటేరియెట్ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు ఆలూరు తిరుపాలు, మండల కార్యదర్శి పూడిపర్తి జనార్దన్లు పాల్గొన్నారు.