నెల్లూరు నగర పాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నాడు రద్దు చేస్తున్నట్లు కమిషనర్ వై. ఓ నందన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు బారా షహీద్ రొట్టెల పండుగ నేపథ్యంలో నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దర్గాలో ప్రత్యేక విధులు కేటాయించినందున ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించడం లేదని తెలిపారు.