ఇటీవలి మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన కుటుంబాల పునరావాసం, సహాయక చర్యల కోసం జిల్లా పరిపాలన విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. బాధితులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం ఉదయం, తుఫాన్ అనంతరం తీసుకుంటున్న చర్యలు, వాటి పురోగతిపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, జిల్లా అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.