నెల్లూరు: కుష్టు వ్యాధి పై సమీక్ష సమావేశం

1చూసినవారు
నెల్లూరు: కుష్టు వ్యాధి పై సమీక్ష సమావేశం
కుష్టు వ్యాధిపై జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ షేక్. ఖాదర్ వలీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెలలో కుష్టు వ్యాధిపై జరిగిన కార్యక్రమాల పురోగతిని సెక్టార్ల వారీగా సమీక్షించారు. కొత్తగా గుర్తించిన కుష్టు వ్యాధిగ్రస్తులు, వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి, చికిత్స అందించి, అంగవైకల్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్