నెల్లూరు: రేపు యధావిధిగా పాఠశాలలు

2చూసినవారు
నెల్లూరు: రేపు యధావిధిగా పాఠశాలలు
జేసి మొగిలి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2వ తేదీ (మంగళవారం)న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్వాడీ పాఠశాలలు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు యధావిధిగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని జేసి ఆదేశించారు. మంగళవారం సెలవు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్