నెల్లూరు: హంస వాహనంలో శ్రీ రంగనాధుడు

6చూసినవారు
నెల్లూరు: హంస వాహనంలో శ్రీ రంగనాధుడు
నెల్లూరు రంగనాయకులపేటలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామి వారి పేట ఉత్సవం మంగళవాయిద్యాలతో అత్యంత ఘనంగా జరిగింది. రాత్రి హంస వాహనంలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉభయకర్తలుగా రంగాచారి వెంకటేష్, హేమ, సతీష్ చంద్ర గుప్తా, మాలిని వ్యవహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్