నెల్లూరు నగరంలోని లిటిల్ బర్డ్స్ స్కూల్ లో ఏపీ బీసీ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా లా సెట్ మోడల్ పరీక్ష నిర్వహించారు. సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువతను న్యాయవాద వృత్తి వైపు ప్రోత్సహించడానికి గత 10 సంవత్సరాలుగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.