నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నులు, తాగునీటి కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, ట్రేడ్ లైసెన్సు పన్నుల ఎగవేతదారులు, అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణ యజమానులుపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ నందన్ సూచించారు. శుక్రవారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో లోక్ అదాలత్ నిర్వహణ అంశంపై సమీక్ష సమావేశం జరిగింది.