నెల్లూరు: వైయస్సార్సీపిది నైతిక విజయం: అనిల్

6చూసినవారు
నెల్లూరు: వైయస్సార్సీపిది నైతిక విజయం: అనిల్
నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైయ‌స్సార్సీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే, కూటమి పార్టీలు పాండిచ్చేరికి క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టడం చూస్తుంటే, అప్పుడే వైయ‌స్సార్సీపీ నైతికంగా విజయం సాధించేసినట్టేనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరులో వైయస్సార్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు తమకు 41 మంది కార్పొరేటర్ల బలం ఉందని చెప్పుకుంటూనే, ఐదుగురు కార్పొరేటర్లు తిరిగి వైయ‌స్సార్సీపీకి వస్తే వణికిపోతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :