సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా నెల్లూరులోని గ్రామ దేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉదయం 10:30 గంటల నుండి మూసివేయబడింది. నాలుగవ తేదీ ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, కార్య నిర్వహణ అధికారి గిరి కృష్ణ తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.