నెల్లూరు: సమిష్టిగా పనిచేసి తుఫాను ముప్పును ఎదుర్కొన్నాం

2240చూసినవారు
మంగళవారం రాత్రి నెల్లూరులో మాట్లాడుతూ, మొంథా తుఫాన్ ప్రభావం జిల్లా కేంద్రంపై ఎక్కువగా ఉందని, తమతోపాటు అధికారులు సమిష్టిగా పనిచేసి తుఫాను ముప్పును ఎదుర్కొన్నామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. తుఫాన్ వల్ల అనేక కాలువలు పొంగి ప్రవహించాయని, వరద నీరు బయటకు వెళ్లేలా అన్ని డివిజన్లలో పర్యటించి చర్యలు తీసుకున్నామన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి లేదా కాల్ సెంటర్లకు ఫోన్ చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్