విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఐదు రోజుల ప్రత్యేక వర్క్‌షాప్ శుక్రవారం ఘనంగా ముగిసింది. “ఇన్నోవేషన్ & ఎంటర్ప్రెన్యూర్షిప్” (నైపుణ్యం మరియు వ్యవస్థాపకత) అనే అంశంపై నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ ఛాన్స్లర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చక్కగా ఎదిగి ఉపాధినిచ్చే స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు.