ప్రజానాట్యమండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి, సీపీఎం కార్యకర్త పెంచలయ్య దారుణ హత్యను నిరసిస్తూ మంగళవారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. కోవూరు పట్టణంలో సీపీఎం, సీపీఐతో పాటు వామపక్ష నేతలు పాల్గొని, స్థానిక బజార్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం నేత రమణయ్య, సీపీఐ నేత లీలామోహన్ మాట్లాడుతూ, గంజాయి అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకే పెంచలయ్యను హత్య చేయడం దారుణమని పేర్కొన్నారు.