నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సెన్సస్ సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మే 1వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి జనగణన సర్వేను విజయవంతం చేయడానికి సూచనలు చేశారు. సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన మ్యాప్ ప్రకారం ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవగాహన కల్పించుకొని, ప్రతి ఇంటిని సర్వేలో కవర్ అయ్యేలా చూడాలని ఆదేశించారు.