జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి పోలీసులు లాడ్జీలు, హోటళ్లు, డార్మెంటరీలు, గెస్ట్ హౌస్‌లు, రిసార్ట్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, సీసీటీవీ, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్ఓసి, జీఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, విజిటర్ ఐడి కార్డులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలను జిల్లా వ్యాప్తంగా స్థానికేతర పోలీసు అధికారులతో కూడిన 77 ప్రత్యేక బృందాలు చేపట్టాయి.