బ్లేడ్ బ్యాచ్ ని నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు

1881చూసినవారు
నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిలో భయం మొదలైంది. సోమవారం రాత్రి, నగరంలో ప్రైవేటు టౌన్ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేసిన ఐదుగురు నిందితులను గాంధీ బొమ్మ సెంటర్ నుంచి నెల్లూరు మద్రాసు బస్టాండ్ వరకు బహిరంగంగా నడిపించారు. నేరస్థులను ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్