నెల్లూరులో స్పా ముసుగులో వ్యభిచారం

2536చూసినవారు
నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగాపురం జగదీశ్ నగర్ సెంటర్లో ఉన్న యూనిసెక్స్, విప్ స్పా సెంటర్లపై శనివారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు యువతులతో పాటు ఒక విటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు కృష్ణవేణి, సుధీర్ పై కేసులు నమోదు చేస్తామని సీఐ సాంబశివ రావ్ తెలిపారు. యువతలను హోంలకు తరలిస్తామని, సాంఘిక కార్యకలాపాలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్