నెల్లూరు కలెక్టరేట్ కు అర్జీదారుల క్యూ

3చూసినవారు
నెల్లూరు కలెక్టరేట్ కు అర్జీదారుల క్యూ
నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, డిప్యూటి కలక్టర్ మురళి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శ్రీధర్ రెడ్డి, డిపిఓ వసుమతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డి. డి నాగ శేఖర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :