రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్, పి ఎం పి అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం, రాజా రవివర్మ 178వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఏఎస్ఐ మహబూబ్ బాషా మాట్లాడుతూ, రాజా రవివర్మ భారతదేశంలోని గొప్ప చిత్రకారుల్లో ఒకరని, ఆయన 1848 ఏప్రిల్ 29న కేరళలోని కిలిమనూర్ గ్రామంలో జన్మించారని, చిన్ననాటి నుంచే చిత్రలేఖనంపై ఆసక్తితో పాటు రాజవంశీయుల ప్రోత్సాహంతో ఎదిగారని తెలిపారు.