మొంథా తుపాన్ కారణంగా పెన్నా నదిలో వరద ఉధృతి పెరగడంతో నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద లంగరు తెగిపోయిన 30 టన్నుల ఇసుక బోటు గేట్ల వైపు దూసుకువచ్చింది. అధికారులు అప్రమత్తమై, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో బోటును బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించి, బోటును విజయవంతంగా తరలించిన వారిని ప్రశంసించారు.