నెల్లూరులోని గాంధీనగర్ ఆర్ఎస్ఎన్ కళ్యాణ మండపంలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు కార్యచరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టి రైతన్నను మోసం చేశారని సమావేశంలో ఆరోపణలు చేశారు.