సర్వేపల్లి కాలువలో మినీ బైపాస్ రోడ్డు సమీపంలోని బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం కొట్టుకురావడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడా లేక హత్య చేసి పడేశారా అనే అనుమానాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలాజీ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.