నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాలస్వామివారి దేవస్థానంలో బుధవారం మతత్రయ ఏకాదశి సందర్భంగా శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో తిరుమంజన (అభిషేక) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అభిషేకానంతరం తులసీదళాలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని, స్వామివారి తిరుమంజనాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఛైర్మన్ చంద్రమౌళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.