తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనలతో పొట్టే పాలెం లో టిడిపి యూనిట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 12వ నంబర్ క్లస్టర్ ఇంచార్జి జలదంకి సుధాకర్, వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత శంకర్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చలు జరిపారు.