ముందుకు వచ్చిన సముద్రం

6చూసినవారు
ముందుకు వచ్చిన సముద్రం
నెల్లూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. ఆకాశం మేఘావృతమై, కొన్నిచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. సముద్రం సుమారు 20 మీటర్ల ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అలల తీవ్రత కారణంగా మత్స్యకారులను 5 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. అధికారులు తీర గ్రామాల్లో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్