జిల్లాలో ఎక్కడా ఆయిల్ కొరత లేదు: జాయింట్ కలెక్టర్

5చూసినవారు
జిల్లాలో ఎక్కడా ఆయిల్ కొరత లేదు: జాయింట్ కలెక్టర్
జిల్లాలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అసత్య ప్రచారాలను నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని శంకరన్ సమావేశ మందిరంలో, జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న అపోహలపై డీఎస్ఓ లీలారాణితో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 243 పెట్రోల్ పంపుల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్