నెల్లూరు కూరగాయల మార్కెట్ వద్ద 2024 అక్టోబర్ 10న అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితులు గోని రాము, పసుపులేటి సందీప్ కుమార్ లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. స్థానికంగా ఉన్న కొబ్బరికాయల షాపు వద్ద వాకా అశోక్ తో గొడవ పడి, కత్తితో పొడిచి చంపిన కేసులో గురువారం ఈ తీర్పు వెలువడింది. నిందితులకు ఒక్కొక్కరికి రూ. 25 వేల జరిమానా కూడా విధించారు.