పొదిలిలో వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం

1467చూసినవారు
పొదిలిలో వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం
ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఆరాధన మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, జనసేన నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు, విజయ గౌరి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆవుల పాపారావు-కళ్యాణి దంపతులు ప్రత్యేక పూజలు చేసి, పట్టువస్త్రాలు అందుకున్నారు. ఎక్కల శేషగిరిరావు దంపతులను శాలువాతో సత్కరించారు. పొదిలి మండల మోటార్ బైక్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుద్ధం శ్రీను బృందం సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్