వైసీపీ అధినేత, మాజీ సీఎం
జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో ఆంక్షలు ఎందుకు పెట్టారని ప్రశ్నించిన ఆయన, ప్రతిపక్ష ఎమ్మెల్యేను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి గురించి స్పందిస్తూ.. ఆ రోజు ఆయన ఇంట్లో ఉంటే చంపేసే వారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, నాడు- నేడు కార్యక్రమం, గోరుముద్ద పథకం నిలిపివేశారని ఫైర్ అయ్యారు.