నేడు, రేపు జిల్లాలో వర్షాలు ?

2చూసినవారు
నేడు, రేపు జిల్లాలో వర్షాలు ?
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో శనివారం, ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో శ్రీలంక వైపు కదులుతోంది. ఈరోజు సాయంత్రంలోపు శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరం దాటే అవకాశముంది. తీర ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.