నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్ సమీపంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహం అస్తిపంజరంగా మారడంతో, సుమారు నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి, నిర్మానుష్య ప్రాంతంలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.